కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కోదండరాం

కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కోదండరాం
x
Highlights

తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయ్. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీలను ఒకే జెండా...

తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయ్. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీలను ఒకే జెండా కిందకు తెచ్చేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. ఎవరి పార్టీ ఎవరితో కలుస్తుంది తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలేంటీ ?

ప్రత్యేక రాష్ట్రం కోసం చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పోరాటం చేశారు. ఉద్యోగులు నుంచి రైతులు వరకు అందరూ ఐక్యమత్యంగా పోరాటం చేసి తెలంగాణను సాధించారు. ప్రత్యేక ఉద్యమంలో టీజేఏసీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంఘాలు, సంస్థలు కేసీఆర్‌తో విభేదించాయ్. ఎవరికి వారు సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఇందులో మొదటిది తెలంగాణ ఇంటి పార్టీ అయితే రెండోది తెలంగాణ జన సమితి. ఈ రెండు పార్టీల లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం కావడంతో ఉద్యమకారులందర్ని ఏకం చేయాలని ఇంటి పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

కోదండరాం తెలంగాణ జన సమితి పార్టీ స్థాపించడంతో ఉద్యమకారులను ఒకే జెండా కిందకు తీసుకొచ్చేందుకు తెలంగాణ ఇంటి పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంటి పార్టీ నేతలతో తెలంగాణ జన సమితి నేతలు రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ జన సమతి, తెలంగాణ ఇంటి పార్టీకి చెందిన కీలక నేతలు చర్చల్లో పాల్గొనట్లు సమాచారం. ఈ సందర్భంగా రెండు పార్టీల నేతల మధ్య పదవుల పంపకంపై డిష్కసన్‌ జరిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి కలిస్తే టీఆర్ఎస్‌కు దూరంగా ఉన్న ఉద్యమకారులు ఏకమవుతారనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. కోదండరాంకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపుంటే ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌కు బీసీ నేతగా తెలంగాణ వ్యాప్తంగా పేరుంది. సామాజిక తెలంగాణ కోసం ఉద్యమకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మరో నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవముంది. తెలంగాణలో బలమైన సామాజిక వర్గాన్ని ఏకం చేయగలిగే నెట్‌వర్క్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ఉంది.

తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి పార్టీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. చర్చల్లో చెరుకు సుధాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత కల్పించాలని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే రెండో స్థానం కల్పించడానికి విముఖత చూపుతున్నట్లు సమాచారం. తెలంగాణ జన సమితిలో పేరున్న నేతలు లేరని ఇంటి పార్టీ నేతలు వాదిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ జన సమితిలో ఉన్న విద్యుత్ జేఏసీ రఘు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌లు, ఇన్నయ్యల వ్యూహాలు పని చేయవని వాదిస్తున్నారు. ఇప్పుడే పార్టీలో సెకండ్‌ లీడర్‌షిప్‌ను ప్రకటిస్తే...ఇబ్బందులు వస్తాయని కోదండరాం అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీని విలీనం చేసిన తర్వాత పదవుల గురించి మాట్లాడుదామని సర్ది చెప్పినట్లు సమాచారం.

మరోసారి భేటీ అయిన తర్వాత ఇంటి పార్టీ విలీన ప్రక్రియ వేగవంతం చేయాలని కోదండరాం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యమకారులందర్ని ఏకం చేయాలనే ఆలోచనకు ప్రతిరూపం ఇచ్చేందుకు ఇంటిపార్టీని విలీనం చేసుకునేందుకు కోదండరాం పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories