ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కేసీఆర్ యాగాలు

x
Highlights

కేసీఆర్ మళ్ళీ యాగం చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, తెలంగాణ ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా..ఇవాల్టి నుంచి హోమాలు చేస్తారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ...

కేసీఆర్ మళ్ళీ యాగం చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, తెలంగాణ ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా..ఇవాల్టి నుంచి హోమాలు చేస్తారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో మూడు రోజులపాటు హోమాలు చేస్తారు. 120 మంది ఋత్వికులు యాగకార్యాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఇప్పటివరకు ఆయన చేపట్టిన హోమాలు, యాగాలే అందుకు నిదర్శనం. గతంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే కోరికతో ఆయన అత్యంత భారీగా అయుత చండీయాగం చేశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఆయుత చండీయాగం గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ అలాంటి యాగాన్నే చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాజిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో రాజశ్యామల హోమం జరుగుతుంది. ఇవాల్టి నుంచి ఎల్లుండి వరకు వరకు యాగం నిర్వహిస్తారు.

జాతకాలు, ముహూర్తాలను ఎక్కువగా విశ్వసించే కేసీఆర్‌ ఎన్నికల్లో గెలుపు, రాజయోగం , తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భారీ హోమం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్‌ జన్మదినం సం దర్భంగా స్వామిజీ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్‌ అక్కడికి వెళ్లారు. తాను చేయబోయే యాగం గురించి అప్పుడే చినజీయర్‌ స్వామికి, వేద పండితులకు వివరించినట్లు సమాచారం. మంచి ముహూర్తం చూసి హోమం చేయాలని పండితులు చెప్పగా వారి సూచనలు, సలహాల మేరకు ఇవాల్టి నుంచి హోమాలకు శ్రీకారం చుడుతున్నారు.

కేసీఆర్ రాజశ్యామల హోమాన్ని చినజీయర్‌స్వామి శిష్యబృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఒకేసారి 120 మంది ఋత్వికులతో హోమం జరుగుతుంది. హోమంలో కేసీఆర్‌ దంపతులు పాల్గొని పూజలు చేస్తారు. రెండోరోజు కేటీఆర్‌ , కవిత కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్య అనుచరులు కూడా యాగంలో పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories