దేశాభివృద్ధికి ఎజెండా

దేశాభివృద్ధికి ఎజెండా
x
Highlights

దేశాభివృద్ధికి అవసరమైన అజెండా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో పలువురు ప్రముఖులు, విశ్రాంత అధికారులు, సీనియర్ అధికారులతో...

దేశాభివృద్ధికి అవసరమైన అజెండా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో పలువురు ప్రముఖులు, విశ్రాంత అధికారులు, సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. దేశంలో ఇంకా ప్రజల ప్రాథమిక అవసరాలు తీరడం లేదని.. తాగు, సాగు నీరు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ర్టాల మధ్య జలవివాదాలు అపరిష్కృతంగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. సమాఖ్య వ్యవస్థ స్పూర్తి పూర్తిస్థాయిలో ప్రతిబింబించడం లేదని.. కేంద్ర-రాష్ర్టాల మధ్య సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిషన్లు, నిపుణుల కమిటీల సూచనలు, సంస్కరణలేవి అమలు కావడం లేదన్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని.. అందుకు రాష్ర్టాలకు స్వేచ్ఛ అధికారం కావాలని సీఎం డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి కావాల్సిన అజెండా రూపకల్పనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని.. దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన మేధావులు ఈ చర్చల్లో భాగస్వాములు కావాలని సీఎం కోరారు. న్యాయ వ్యవస్థలో, పాలనా వ్యవస్థలో, శాసన వ్యవస్థలోనూ మార్పులు రావాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories