అభ్యర్థులకు ప్రచార వ్యూహాన్ని దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ ...అలసత్వం వీడితే...

Submitted by arun on Mon, 10/22/2018 - 10:04
kcr

విజయదశమి వెళ్లిపోయింది.. ఇక విజయతీరాలను అందుకోవడమే మిగిలి ఉందని.. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రచారంలో ఎక్కడా అలసత్వం వద్దంటూ సూచనలు చేశారు. నిర్లక్ష్యం వహించకుంటే ఈ సారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని భరోసా ఇచ్చారు. 

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేశారు గులాబీ బాస్ కేసీఆర్‌. ఎన్నికలకు ఇంకా నెలన్నర రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 105 మంది ఎమ్మెల్యే అభ్యర్దులతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రచార వ్యూహాన్ని వివరించారు. ఇక ఈ నెలాఖరులో వరంగల్, ఖమ్మంలో కేసీఆర్‌ సభలు నిర్వహించనున్నారు. ఇటు గ్రేటర్‌ పరిధిలో ఒక్క భారీ సభ మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలతో లబ్దిపోందిన వారి వివరాలతో కూడిన జాబితాలు అందజేసారు. 

మహాకూటమి అభ్యర్దులు ప్రచారంలోకి దిగేలోగా.. ప్రతి నియోజక వర్గాన్ని టీఆర్ఎస్ అభ్యర్దులు రెండు సార్లు చుట్టి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ప్రతీ నియోజకవర్గంలో 60 వేల నుంచి 70 వేల మంది లబ్దిదారులున్నారని వారి ఓట్లు మిస్ కాకుండాచూసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆసరా పింఛన్‌దార్లు ఓటింగ్ రోజు మొదటి గంటలో పడేలా చూసుకోనాలని హతబోద చేశారు. బూత్‌ స్థాయిలో కాకుండా ఓటర్ స్థాయిలో ఓటు కారు గుర్తుకు పడేలా చూసుకోవాలన్నారు. చివరగా.. ఈసీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. అభ్యర్థులకు సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చారు. వచ్చే రోజులన్నీ కీలకం అని.. అలసత్వం అసలే వద్దని సూచించారు. 
 

English Title
cm kcr meet trs party candidates

MORE FROM AUTHOR

RELATED ARTICLES