రాహుల్ గాంధీ నీకు దమ్ముందా? : సీఎం కేసీఆర్

రాహుల్ గాంధీ నీకు దమ్ముందా? : సీఎం కేసీఆర్
x
Highlights

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయితో విరుచుకపడ్డారు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్. మాటలే అస్త్రాల్లా వదిలారు. ఇల్లందు నియోజకవర్గంలో...

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయితో విరుచుకపడ్డారు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్. మాటలే అస్త్రాల్లా వదిలారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీ ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగిస్తూ తాజాగా సీతారామ ప్రాజెక్టును తప్పబట్టిన రాహుల్ గాంధీని ధుయ్యబట్టారు. కాంగ్రస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలివిఉండే మాట్లాడుతుండా, కొంచెం సోయి ఉండిమాట్లాడాలని ఎద్దేవ చేశారు. మేము కమిషన్ల కోసం రీడిజైన్ చేసినిమా..? ఓ రాహుల్ గాంధీ నీకు దమ్ముందా..? వస్తవా మా వెంబడి. పోదామా రుద్రమ కోట కాడికి నీ తండ్రిపేరుమీద ఉన్న రాజీవ్ గాంధీ, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ అసలు ఎట్ల ఉన్నాయో సుద్దామా.? రా నువ్వు నా వెంట తీసుకపోతా రా.. అంటూ నిప్పులు చెరిగారు కెసిఆర్. ఇష్టం వచ్చినట్లు రాసిస స్ర్కీప్టు చదవడం కాదు కొంచెం ఆచి తూచి మాట్లాడాలని రాహుల్ కు కీతాబు ఇచ్చిారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ లాంటి డుప్లికేట్ స్కీంలను బంద్ పెట్టి సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేసాము. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories