కిడారి కొడుక్కి గ్రూప్1 ఉద్యోగం.. రెండు కుటుంబాలకు ఆర్ధికసాయం ఎంతంటే..

కిడారి కొడుక్కి గ్రూప్1 ఉద్యోగం.. రెండు కుటుంబాలకు ఆర్ధికసాయం ఎంతంటే..
x
Highlights

ఆదివారం మావోయిస్టుల దుశ్చర్యకు బలైన మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల కుటుంబాలను సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఈ...

ఆదివారం మావోయిస్టుల దుశ్చర్యకు బలైన మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల కుటుంబాలను సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఈ సందర్బంగా కుటుంబసభ్యులను ఓదారుస్తూ.. ప్రభుత్వపరంగాను, పార్టీ పరంగాను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారిద్దరి మరణం నన్ను చాల బాధకు గురిచేసిందని వారితో అన్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు తాము వ్యతిరేకమని చెప్పినా ప్రజాప్రతినిధులను చంపడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు అవకాశం లేదన్న అయన మావోయిస్టుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఇదిలావుంటే కిడారి చిన్న కుమారుడికి గ్రూప్‌ వన్‌ ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మొదటి కుమారుడికి ఏం చేయాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ పరంగానూ ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు.కోటి రూపాయల ఆర్థికసాయం అందజేస్తామని, విశాఖలో ఇంటి నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని చంద్రబాబు చెప్పారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబానికి కూడా చంద్రబాబు ఆర్థికసాయం ప్రకటించారు. ఏడుగురు కుటుంబ సభ్యులకు 10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామన్నారు. అలాగే పార్టీ తరపున ఒక్కొక్కరికి 5లక్షలు సహాయం చేస్తామని తెలిపారు. సోమ రెండో కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories