ఏపీలో నిరుద్యోగం లేకుండా చేస్తా : ముఖ్యమంత్రి చంద్రబాబు

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 20:27
cm chandrababunaidu comments on unemployement

 ఏపీలో నిరుద్యోగం లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇటీవల ఎక్కడా లేని విధంగా యువనేస్తం తీసుకొచ్చామని తెలిపిన అయన సివిల్‌ సర్వీసెస్‌కు ఉచితంగా కోచింగ్‌ ఇప్పిస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగు నీరు ఇవ్వటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక కంపెనీలను ఏపీకి  తీసుకొస్తామని అన్నారు.  అంతేకాదు తాము అధికారంలోకి వచ్చాక కంపెనీలతో 2705 ఎంవోయులు కుదుర్చుకున్నామని ప్రకటించారు. దీంతో రాష్ట్రానికి 15 లక్షల 61 వేల కోట్ల పెట్టుబడులు..33 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 755 ప్రాజెక్టులు పూర్తి కావొచ్చాయని..వాటితో పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయన్నారు.  

English Title
cm chandrababunaidu comments on unemployement

MORE FROM AUTHOR

RELATED ARTICLES