ఢిల్లీ వేదికగా కేంద్రంపై చంద్రబాబు దాడి

Submitted by arun on Sat, 07/21/2018 - 14:50

ప్రస్తుతం జరుగుతున్న పోరాటం బీజేపీ, టీడీపీ మధ్య కాదని మెజార్టీకి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమని చంద్రబాబు అన్నారు. విభజన చట్టాలన్నింటినీ అమలు చేస్తామని అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీ వచ్చిందని లోక్ సభలో మోడీ చెప్పారని ప్రజా తీర్పును తాము కూడా గౌరవిస్తామని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత కేంద్రంపై అవిశ్వాసం పెట్టింది తామేనని చంద్రబాబు అన్నారు. 

ఢిల్లీని మించిన రాజధానిని ఇస్తామని చెప్పిన మోడీ మాట తప్పారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. జాతీయ పార్టీతో కలసి ఉంటేనే ఏపీ ప్రయోజనాలను సాధించుకోగలమనే నమ్మకంతో ఎన్నికల సమయంలో బీజేపీతో చేతులు కలిపామని ఇరు పార్టీలు కలసి ప్రచారాన్ని నిర్వహించామని, కలసికట్టుగా విజయం సాధించామని చెప్పారు. తిరుమల వెంకన్న సాక్షిగా మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏదీ నెరవేర్చలేదని చంద్రబాబు ఆరోపించారు.

మెజార్టీ లేకున్నా తాము అవిశ్వాసం పెట్టామని ఇది మెజార్టీ, మొరాలిటీ మధ్య పోరాటం అని.. ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా.. మోడీ ఎన్నో బహిరంగ సభలో చాలా హామీలిచ్చారని.. అవేవీ నెరవేరలేదని గుర్తు చేశారు. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మించేందుకు సహాయం చేస్తానని మోడీ హామీలిచ్చారంటూ చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పుడెందుకు నెరవేర్చడం లేదని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూపిస్తున్న మోడీ సర్కారు దాన్ని మీరెందుకు మర్చిపోయారని చంద్రబాబు నిలదీశారు. 

English Title
CM Chandrababu Press Meet At Delhi On No Confidence Motion in Parliament

MORE FROM AUTHOR

RELATED ARTICLES