వారికి 50ఏళ్లు దాటితే పెన్షన్లు మంజూరు చేస్తాం : సీఎం చంద్రబాబు

Submitted by nanireddy on Fri, 08/10/2018 - 09:21
cm-chandrababu-participate-adhivasi-dinotchavam-in-paderu

ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 50ఏళ్లు దాటిన ఆదివాసీలకు పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. ఎవరూ అడగకుండానే వరాలు ఇచ్చే ప్రభుత్వం తమదన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి అందుతుందని అన్నారు. పాడేరులో జూనియర్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన గిరిజనోత్సవం బహిరంగ సభలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు సీఎం.. ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వలక్ష్యమన్నారు.. పాడేరు మండలం అడారిమెట్టలో గ్రామదర్శినిలో పాల్గొన్నారు.. అంగన్‌వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలలో డిజిటల్‌ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు సంప్రదాయ టోపీని, విల్లుతో చంద్రబాబును సన్మానించారు.

English Title
cm-chandrababu-participate-adhivasi-dinotchavam-in-paderu

MORE FROM AUTHOR

RELATED ARTICLES