పోలవరం పనులపై సీఎం సమీక్ష

Submitted by santosh on Mon, 05/14/2018 - 16:48
cm chandrababu naidu polavaram review

పోలవరం ప్రాజెక్ట్‌పై అమరావతి సచివాలయలం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కాంక్రీట్‌ పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థల తీరును తప్పుబట్టిన సీఎం... ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 53 శాతం ప్రాజెక్ట్‌ పనులు పూర్తయినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. జూన్‌ 11లోగా డయాఫ్రమ్‌ వాల్‌తో పాటు కాపర్‌ డ్యామ్‌ నిర్మానికి సంబంధించిన జెట్‌ గ్రౌటింగ్‌ పనులు కూడా పూర్తవుతాయని సీఎంకు వివరించారు.

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయా ఫ్రమ్‌ వాల్ జెట్ గ్రౌటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెల్లడించారు. జూన్ 11లోగా డయా ఫ్రమ్‌ వాల్‌తో పాటు కాఫర్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన జెట్ గ్రౌటింగ్ పనులు కూడా పూర్తవుతాయని వెల్లడించారు. అమరావతి సచివాలయం నుంచి పోలవరం ప్రాజెక్టుపై 60వ సారి వాస్తవ సదృశ్య తనిఖీ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం.. కాంక్రీటు పనుల్లో వేగం మందగించటంపై నిర్మాణ సంస్థలను ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటివరకు 53.50శాతం పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు 89.6 శాతం, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.60 శాతం, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్ మట్టి పనులు 73.2 శాతం మేర పూర్తయ్యాయని వివరించారు. స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు 21.83 శాతం మేర పూర్తయినట్లు తెలిపారు. గోదావరి కుడిగట్టు నుంచి డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం 91 శాతం మేర పూర్తయిందని తెలిపారు. జూన్ 11 తేదీ లోగా దీనిని మొత్తం పూర్తి చేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయని.. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు కూడా 60.28 శాతం మేర పూర్తి చేశామని వివరించారు.

English Title
cm chandrababu naidu polavaram review

MORE FROM AUTHOR

RELATED ARTICLES