రేపటి మోడీ నిరాహార దీక్ష విడ్డూరం : చంద్రబాబు

Submitted by arun on Wed, 04/11/2018 - 17:40
babu

ప్రధాని మోడీ రేపు ఒకరోజు నిరాహార దీక్ష చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు, విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన జ్యోతీబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.....ప్రధాని తీరుపై  నిప్పులు చెరిగారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ దీక్ష చేస్తున్నట్లు మోడీ చెబుతున్నారని... అసలు అందుకు కారణం ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయకుండా పార్లమెంటులో అన్నాడీఎంకేతో గొడవ చేయించి..తీరా ఇప్పుడు దీక్ష అంటున్నారని విమర్శించారు. పైగా పార్లమెంటులో విపక్షాలు చేసింది తప్పన్నట్లు చిత్రీకరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

English Title
CM Chandrababu Naidu Fires On PM Narendra Modi

MORE FROM AUTHOR

RELATED ARTICLES