కేంద్రంపై విరుచుకుప‌డ్డ సీఎం చంద్ర‌బాబు

Submitted by arun on Mon, 02/19/2018 - 15:26
babu

సీఎం చంద్రబాబు మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలు అమలు కావడం లేదని, సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదో కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల మనోభావవాలు దెబ్బతినకుండా కేంద్ర వ్యవహరించాలని సూచించారు.

ప్రతిపక్ష నేత జగన్‌పైనా సీఎం మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసమంటున్న జగన్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ చట్టాలు తెలుకొని మాట్లాడాలని హితవు పలికారు. టీడీపీ దూరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 

మరోవైపు విభజన హామీలపై చర్చకు అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అన్ని పార్టీలను సమావేశపర్చి విభజన హామీలపై చర్చిస్తామన్నారు. విభజన హామీల అమలు కోసం అఖిలపక్షంతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

English Title
CM Chandrababu Naidu Comments on Central Govt

MORE FROM AUTHOR

RELATED ARTICLES