తిరుపతిలో ఆరుగురు విద్యార్థులు మిస్సింగ్‌

Submitted by arun on Fri, 10/12/2018 - 12:25
tpt

తిరుపతిలోని మాతృశ్రీ టెక్నో స్కూల్ లో ఆరుగురు విద్యార్థులు అదృశ్యం.. కలకలం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. నిన్న ఉదయం స్కూల్‌ స్టడీ అవర్‌ కోసం వచ్చి కనిపించకుండా పోయారు. తమ పిల్లలింకా ఇంటికి రాలేదంటూ తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే నిన్న ఉదయం 8 గంటలా 30 నిముషాలకే పాఠశాల నుంచి పంపించేశామని.. యాజమాన్యం తెలిపింది. అయితే ఆ ఆరుగురు విద్యార్థులు స్టడీ అవర్‌కు రాకుండా.. సినిమాకు వెళ్లిన విషయాన్ని గమనించిన స్కూల్‌ యాజమాన్యం.. తల్లిదండ్రులను తీసుకురావాలని హుకూం జారీ చేసింది. దీంతో స్కూల్‌ నుంచి వెళ్లి వారు ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు.. స్కూల్‌ ముందు ఆందోళన చేపట్టారు. ఇటు ఫిర్యాదు అందుకున్న తిరుపతి ఈస్ట్‌ పోలీసులు.. సీసీ టీవీ ఫూటేజ్‌ ఆధారంగా.. పిల్లల జాడ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

Tags
English Title
class 10th students missing in tirupati

MORE FROM AUTHOR

RELATED ARTICLES