పొత్తు పొడిచింది... కాంగ్రెస్‌లో క్లారిటీ వచ్చింది... కానీ!!

పొత్తు పొడిచింది... కాంగ్రెస్‌లో క్లారిటీ వచ్చింది... కానీ!!
x
Highlights

కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు 74 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. సోనియా గాంధీ నివాసంలో నిన్న జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాకు గ్రీన్...

కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు 74 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. సోనియా గాంధీ నివాసంలో నిన్న జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా 26 సీట్లను భాగస్వామ్య పక్షాలకు కేటాయించారు. ఈ జాబితాను అధికారికంగా నేడో, రేపో విడుదల చేయనున్న కాంగ్రెస్ అధిష్టానం.. పెండింగ్ స్థానాల్లో త్వరలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామంటోంది. మరి ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారు..? వారికి ఏ స్థానాలు దక్కాయి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వేళాయినా.. ఇంకా పొత్తుల వ్యవహారం తేల్లేదు. మొత్తం 119 స్థానాలకు గాను 93 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్.. కూటమిలో భాగస్వామ్య పక్షాలకు 26 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో టీడీపీకి 14, టీజేఎస్‌కి 8, సీపీఐకి 3, ఇంటి పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించిన కాంగ్రెస్ 74 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ఎట్టకేలకు రెడీ చేసింది. ఈ జాబితా ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ నుంచి పి.హరీశ్‌రావు, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు, ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ నుంచి గండ్రోత్ సుజాత, బోథ్ నుంచి సోయం బాపూరావు, నిర్మల్ నుంచి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ నుంచి రామారావు పటేల్, చెన్నూర్ నుంచి వెంకటేశ్ నేత, బెల్లంపల్లి నుంచి శంకర్ పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది.

ఇక కరీంనగర్ జిల్లాలో జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి, కోరుట్ల నుంచి జువ్వాది నరసింగరావు, మంథని నుంచి శ్రీధర్‌బాబు, పెద్దపల్లి నుంచి విజయ రమణారావు, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నుంచి కె.కె. మహేందర్‌రెడ్డి, మానుకొండూర్ నుంచి ఆరేపల్లి మోహన్, హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో బోధన్ నుంచి సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి మహేష్‌కుమార్ గౌడ్, బాల్కొండ నుంచి అనిల్, జుక్కల్ నుంచి గంగారామ్, బాన్సువాడ నుంచి బాలరాజు, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, మెదక్ జిల్లా ఆంధోల్ నుంచి దామోదర రాజనర్శింహ, జహీరాబాద్ నుంచి గీతారెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, మెదక్ నుంచి విజయశాంతి, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, గజ్వేల్ నుంచి వి.ప్రతాప్‌రెడ్డి పేర్లను అధికాష్టానం ఖరారు చేసింది.

అలాగే, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి, పరకాల నుంచి కొండా సురేఖ, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, ములుగు నుంచి సీతక్క, జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్య, పాలకుర్తి నుంచి జంగా రాఘవరెడ్డి, డోర్నకల్ నుంచి రాంచందర్ నాయక్, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఇందిర పేర్లు ఖరారయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి, నారాయణ‌్‌పేట్ నుంచి శివకుమార్‌రెడ్డి, జడ్చర్ల నుంచి మల్లు రవి, షాద్ నగర్ నుంచి ప్రతాప్ రెడ్డి, వనపర్తి నుంచి చిన్నారెడ్డి, గద్వాల నుంచి డీకే అరుణ, అలంపూర్ నుంచి సంపత్, నాగర్‌కర్నూల్ నుంచి నాగం జనార్ధన్‌రెడ్డి, అచ్చంపేట నుంచి వంశీకృష్ణ, కల్వకుర్తి నుంచి వంశీచంద్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి హర్షవర్ధన్‌రెడ్డి పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్.

ఇక నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి, సూర్యాపేట నుంచి దామోదర్‌రెడ్డి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి నుంచి అనిల్ రెడ్డి, నకిరేకల్ నుంచి చిరుముర్తి లింగయ్య, తుంగతుర్తి నుంచి డాక్టర్ రవి, ఆలేరు నుంచి భిక్షమయ్య గౌడ్, ఖమ్మం జిల్లా పినపాక నుంచి రేగ కాంతారావు, పాలేరు నుంచి ఉపేందర్‌రెడ్డి, మధిర నుంచి మల్లు భట్టివిక్రమార్క, వైరా నుంచి రాముల్ నాయక్, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు పేర్లు ఖరారయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, గోషామహల్ నుంచి ముఖేష్‌గౌడ్, కంటోన్మెంట్ నుంచి సర్వే సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్, ఎల్‌.బి.నగర్ నుంచి సుధీర్‌రెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, పరిగి నుంచి రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్, తాండూర్ నుంచి రోహిత్‌రెడ్డి పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories