రేపటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్

రేపటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్
x
Highlights

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ రేపటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌ పాటించాలని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి...

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ రేపటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌ పాటించాలని దక్షిణాది రాష్ట్రాల సినిమా నిర్మాతల మండలి నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్లను బంద్‌ చేస్తున్నట్టు సురేష్‌బాబు తెలిపారు. ఇంగ్లిష్ సినిమాలకు వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు వసూలు చేయని డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు.. ప్రాంతీయ చిత్రాలకు మాత్రం వీపీఎఫ్‌ తగ్గించడం లేదన్నారు. వీపీఎఫ్‌ ధరలు తగ్గించే వరకు థియేటర్ల బంద్‌ కొనసాగుతుందని స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories