ఒక్క రోజులో ఒక కోటిపైన వ్యూస్

x
Highlights

'సైరా నరసింహారెడ్డి' సినిమా టీజర్‌ సై సై అని, రిలీజ్ అవుతూనే మెగా రికార్డు సృష్టిన్చెను కదా, 24 గంటల్లో 1.20 కోట్ల డిజిటల్‌ వ్యూస్ కని, మన...

'సైరా నరసింహారెడ్డి' సినిమా టీజర్‌ సై సై అని,

రిలీజ్ అవుతూనే మెగా రికార్డు సృష్టిన్చెను కదా,

24 గంటల్లో 1.20 కోట్ల డిజిటల్‌ వ్యూస్ కని,

మన మెగాస్టార్ పుట్టినరోజు పండగ చేసే కదా. శ్రీ.కో.


మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా టీజర్‌ రిలీజ్ అవుతూనే మెగా రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల్లో 1.20 కోట్ల డిజిటల్‌ వ్యూస్‌ను సాధించిందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసారు. ఇప్పటి వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌ సాధించిన సినిమా టీజర్ ఇదేనని టీం సైర పేర్కొంది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ప్రత్యెక చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం చిరు పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం 'సైరా' చిత్ర టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభిమానులకు పుట్టినరోజు కనుల విందు అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories