రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్ చేసిన 'సైరా'

రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్ చేసిన సైరా
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్వాతంత్ర్య సమరయోధుయాడు ఉయ్యాలావాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి....

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్వాతంత్ర్య సమరయోధుయాడు ఉయ్యాలావాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే చిరు బర్త్ డే సందర్బంగా ఇవాళ ఓ టీజర్ విడుదలైంది. చిరంజీవి స్టామినా ఏంటో ఆ టీజర్ మరోసారి రుజువు చేసింది. టీజర్‌లో సైరా నరసింహారెడ్డిగా చిరు లుక్‌ను రివీల్‌ చేశారు. అంతేకాదు ఈ యుద్ధం ఎవరిది అంటూ చిరు చెప్పిన డైలాగ్‌తో కట్ చేసిన టీజర్‌లో భారీ గ్రాఫిక్స్‌, చిరు గెటప్‌, సెట్స్‌ ఇలా అన్ని టీజర్ కు హైలేట్ గా నిలిచాయి. ఈ టీజర్ యూట్యూబ్ లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే దాదాపు 30 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ట్విట్టర్, పేస్ బుక్ లను కూడా కలుపుకుంటే సైరా టీజర్ 50 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకున్నట్టు కనిపిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా నిర్మిస్తున్నారు. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరొందిన సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరు సరసన కేరళ బ్యూటీ నయనతార నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు జగపతి బాబు, సుధీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories