బొత్స సమక్షంలో వైసీపీలో చేరిన చిరంజీవి

Submitted by nanireddy on Mon, 08/06/2018 - 10:02
chiranjeevi joined in ycp in the presence of botsa sathyanarayana

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ క్రమంగా  వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కొందరు  నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. తాజాగా హైకోర్టు న్యాయవాది, చేయూత సోషల్‌ సర్వీస్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, మొదలవలస చిరంజీవి బొత్స సమక్షంలో వైసీపీలో చేరారు. వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. వచ్చే  జెడ్పీటీసీ ఎన్నికల్లో  పోటీచేసి జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా ఎన్నికవ్వాలనే ఉద్దేశంతో అయన వైసీపీని ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అది కుదరని పక్షంలో విజయనగరం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గంనుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు వినికిడి. 

English Title
chiranjeevi joined in ycp in the presence of botsa sathyanarayana

MORE FROM AUTHOR

RELATED ARTICLES