వీరశంకర రెడ్డి, మొక్కే కదా అని పీకేయాలని చూస్తే!

వీరశంకర రెడ్డి, మొక్కే కదా అని పీకేయాలని చూస్తే!
x
Highlights

ఇంద్ర చిరంజీవి ఫ్యాక్షనిజంపై నటించిన తెలుగు చిత్రం. ఇది వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ 2002 సంవత్సరంలో నిర్మించారు. ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలు...

ఇంద్ర చిరంజీవి ఫ్యాక్షనిజంపై నటించిన తెలుగు చిత్రం. ఇది వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ 2002 సంవత్సరంలో నిర్మించారు. ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలు చాల ఫేమస్ అయ్యాయి..అందులో కొన్ని ....నా కూతురు కాశీలో ఉందనుకొన్నాను, సాక్ష్యాత్ కాశీ విశ్వనాథుని పాదాల దగ్గర ఉన్నదని ఇప్పుడే తెలిసింది.................షౌకత్ ఆలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని పోతున్నాను. అదే నీ వైపు ఉండి ఉంటే ఇక్కడి నుండి తలలు తీసుకెళ్ళేవాడిని. మా వాడు ఫోన్ చేసేదాకా వచ్చాడు అంటే, మీ అమ్మాయి ఎక్కడిదాకా వచ్చిందో నేను అడగను. పెళ్ళి కావలసిన పిల్లని పది మందిలోకీ పిలిచి పంచాయితీ పెట్టకు, తన మనసు తెలుసుకొని నిఖా పక్కా చేసుకో!............సింహాసనం పై కూర్చుండే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనా రెడ్డి ది..................కాశీకి వెళ్ళాడు, కాషాయం వాడయ్యాడు అనుకున్నారా, వారణాసికి వెళ్ళాడు, తన వరస మార్చుకొన్నాడు అనుకొన్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సై అంటే సెకనుకొక తల తీసుకెళతా............ఇంద్ర సేనా రెడ్డి, మా వెనకనే సీమకి వస్తావు, చంపటానికి కాదు, చావటానికి....................నిన్ను పొడిస్తే 'అమ్మా' అంటావు, నువ్వు ఆ అమ్మ కడుపులోనే పొడిచావు..............వీరశంకర రెడ్డి, మొక్కే కదా అని పీకేయాలని చూస్తే, పీక కోస్తా..............నేను మీ వాడిని, మీతో నే ఉంటాను. ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్లతో ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మీరు ఇప్పటివరకు చూడకుంటే మాత్రం తప్పకుండా ఒక సారి చూడండి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories