జగన్ పాదయాత్రలో చిక్కుకున్న చింతమనేని కాన్వాయ్

Submitted by santosh on Mon, 05/14/2018 - 12:52
chinthamaneni in jagan padayatra

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కష్టాలొచ్చాయి. ఏలూరు రూరల్ మండలం లింగాలగూడెం వద్ద జగన్ పాదయాత్ర జరుగుతోంది. అదే సమయంలో చర్చి ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే చింతమనేని కాన్వాయ్ పాదయాత్ర మధ్యలో చిక్కుకుపోయింది. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు మోహరించి, కాన్వాయ్‌ను పంపించారు. పాదయాత్రకు వచ్చిన వైసీపీ కార్యకర్తలకు చింతమనేని ప్రభాకర్ చాక్లెట్ పంచి, ఎవరి కార్యక్రమాలు వారివేనంటూ ముందుకు సాగారు. 

English Title
chinthamaneni in jagan padayatra

MORE FROM AUTHOR

RELATED ARTICLES