చింతమడక నుంచి చీఫ్ మినిస్టర్

x
Highlights

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే...కేసీఆర్ తెలంగాణ సీఎం అయినా.. ఆ ఊరి బిడ్డడే. అందుకే... కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఆ పల్లె...

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే...కేసీఆర్ తెలంగాణ సీఎం అయినా.. ఆ ఊరి బిడ్డడే. అందుకే... కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఆ పల్లె ఆనందంతో పరవశిస్తోంది. రెండోసారి సీఎంగా అధికార పగ్గాలు చేపట్టనున్న తమ సొంత మనిషి గురించి చింతమడక గ్రామం గొప్పగా చెప్పుకుంటోంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్‌ తెలంగాణ సాధనే లక్ష్యంగా అహర్నశలు పోరాడిన యోధుడు. తెలంగాణ కోసం గొంగళి పురుగును కూడా ముద్దాడిన ఉద్యమకారుడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రజానేత. విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో వచ్చిన కేసీఆర్ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందారు. కేసీఆర్ జీవన ప్రస్తానాన్ని చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954 న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా వర్శిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ పూర్తి చేశారు. 29 ఏళ్ల వయస్సులో తొలిసారిగా1983 ఎన్నికల్లో టీడీపీ తరపున సిద్దిపేట నుంచి పోటీచేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి అనంతుల మదన్ మోహన్ పై స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఆ తరువాత 1985 నుంచి పోటీచేసిన ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్ విజయపరంపర కొనసాగిస్తూ వచ్చారు. అప్రతిహతంగా విజయాలను నమోదు చేస్తూ రికార్డు స్థాయిలో మెజార్టీలను సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories