నా ముందే చిన్మయిని గదిలోకి రమ్మన్నారు: తల్లి పద్మాసిని

Submitted by arun on Fri, 10/12/2018 - 13:00
Chinmayi Sripaada

హాలీవుడ్‌ నుంచి భారత్‌కు వచ్చిన మీటూ ఉద్యమం ఉప్పెనలా ఎగసిపడుతోంది. సినీ రంగం నుంచి పలు రంగాలకు విస్తరిస్తోంది. ప్రముఖుల వికృత చేష‌్టలను బయటపెడుతోంది. ఒకరి నుంచి ఒకరు స్పూర్తి పొందుతూ గతంలో తమకు జరిగిన అన్యాయాలను వెల్లడిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినవారికి కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్నారు. మాజీ నటి తనుశ్రీ దత్తా అందించిన స్పూర్తితో భారతదేశంలో మీ టూ ఉద్యమం ఊపందుకుంది. పలు రంగాల్లో పనిచేస్తున్న మహిళలు తమకు గతంలో జరిగిన అన్యాయాలను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేస్తున్నారు. పని ప్రదేశంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులు, దాడులను వెల్లడిస్తున్నారు. 

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్న సందేశాలు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. మనవరాలి వయసులో ఉన్నప్పుడే  తనను లైంగికంగా వేధించారంటూ  తమిళ సినీ దిగ్గజం, ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై తీవ్ర ఆరోపణలు చేసింది. పలుకుబడి ఉన్న వైరముత్తు వల్ల ఇకపై తనకు సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు రాకపోయినా లెక్కచేయనని, తన మాటలకు కట్టుబడి ఉన్నానని చిన్మయి ట్విట్టర్‌లో స్పష్టం చేసింది. చిన్మయి శ్రీపాద  చేస్తున్న ‘మీ టూ’ పోరాటానికి తారలు సమంత, వరలక్ష్మి కూడా మద్దతు పలికారు. వైరముత్తుపై చిన్మయితో పాటు మరో అమ్మాయి కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు.
 
తన కుమార్తె చిన్మయి సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఆమె తల్లి పద్మాసిని తొలిసారి స్పందించారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తన ముందే తన కూతురిని వైరముత్తు గదిలోకి పిలిచాడని ఆరోపించారు. 2004లో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ, తాము ఓ చిత్రం ఆడియో ఫంక్షన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లామని, కార్యక్రమం ముగిసిన తరువాత అందరినీ పంపించిన నిర్వాహకులు తమను మాత్రం అక్కడే ఉంచారని చెప్పారు. తమ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి, చిన్మయి కోసం వైరముత్తు గదిలో వేచిచూస్తున్నాడని, ఆమెను లోపలికి రమ్మంటున్నారని, తనను మాత్రం అక్కడే వెయిట్ చేయాలని చెప్పాడని పద్మాసిని తెలిపారు. హోటల్‌కు చిన్మయి ఎందుకు ఒంటరిగా వెళ్లాలి. ఏదైనా వృత్తి పరమైన విషయాలు మాట్లాడాలంటే ఊరికు వెళ్లిన తరువాత చూసుకోవచ్చు. ఎందుకీ రహస్య కలయిక అని అడిగాను. అందుకు అతను వైరముత్తుకు కాస్త సహకరించండి అని బహిరంగంగానే అన్నాడు. అందుకు వేరేవారిని చూసుకోండి అని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేశాం. మీటూ సంఘానికి చిన్మయి మద్దతుగా నిలిచారు. ఇది మహా సంఘంగా మారాలి. ఇప్పుడిప్పుడే అందరూ దీని గురించి మాట్లడటం మొదలెట్టారు. పాడైపోతున్న ఈ సమాజానికి అవగాహన కలగాలి’ అని అన్నారు.
 

English Title
Chinmayi Sripaada's mom opens up about Vairamuthu's harassment

MORE FROM AUTHOR

RELATED ARTICLES