ఇల్లు కాలిపోతే సెల్ఫీలు దిగుతూ పోస్టులు పెట్టిన జంట!

Submitted by arun on Sun, 01/14/2018 - 11:39
couple selfie

సాధారణంగా ఇల్లు తగలబడితే ఎవరైనా తీవ్ర విషాదంలోకి వెళతారు. కంగారెత్తిపోయి ఏం చేయాలో పాలుపోక ముఖంలో చిరునవ్వు మాయమై దుఃఖాన్ని వేలాడేసుకొని కనిపిస్తారు. కానీ, చైనాలో ఓ జంట మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తగలబడిన తమ ఇంట్లో నిల్చొని సెల్ఫీలతో పోటీ పడ్డారు. పదుల సంఖ్యలో హాయిగా నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకున్నారు. వీడియోలు కూడా రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ ఘటన చైనాలోని నానింగ్ ప్రాంతంలో జరిగింది. "నేను ఆ సమయంలో బాత్ రూములో ఉన్నాను. ఏదో కాలుతున్న వాసన వచ్చింది. డోర్ తీసి చూస్తే మంటలు కనిపించాయి. వస్తువులన్నీ కాలిపోతున్నాయని తెలిసింది.

వెంటనే వెళ్లి నా గర్ల్ ఫ్రెండ్ ను నిద్రలేపా. ఇద్దరమూ కలసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాం. ఇరుగు, పొరుగు వచ్చి సాయం చేశారు" అంటూ జాంగ్ చెంగ్ అనే వ్యక్తి తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆరోజే వారు ఇంట్లో బర్త్ డే వేడుకలు జరుపుకున్నారట. మంటలు ఆరిపోయిన తరువాత, ఇల్లు శుభ్రం చేసే పనిని కూడా పక్కన బెట్టిన ఈ జంట, సెల్ఫీలు దిగుతూ, నష్టాన్ని చూసి తాము కుంగిపోవడం లేదని క్యాప్షన్లు పెడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటం గమనార్హం.

English Title
chinese couple took selfies after fire their home

MORE FROM AUTHOR

RELATED ARTICLES