మామిడి పండ్లు తింటే కొడుకులు పుడతారట!

Submitted by arun on Tue, 06/12/2018 - 15:50
Sambhaji Bhide

ఎంత మంది పిల్లలున్నా.. వారసుడిని కనాలని.. ప్రతీ జంటా కోరుకుంటుంది. చాలామంది జంటలు.. మగబిడ్డల కోసం ఎక్కని ఆస్పత్రీ ఉండదు.. ప్రదక్షిణ చేయని ఆలయం ఉండదు. అమ్మాయిలెంత మంది ఉన్నా.. అబ్బాయిని కనాలని ఆరాటపడే వారికి ఓ సరికొత్త ఐడియా ఇస్తున్నాడో మరాఠీ లీడర్. తాను చెప్పినట్లు చేస్తే.. 9 నెలల్లో మగబిడ్డను ప్రసవించడం ఖాయం అంటున్నాడు. ఆ మరాఠా నాయకుడి దగ్గరున్న ఐడియా ఏంటో మీరే చూడండి. 

మామిడి పండ్లు తింటే పిల్లలు పుడతారా? మగపిల్లలు కావాలంటే ఆ తోటలోని మామిడి పళ్లే తినాలా?.. మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కానీ.. మా తోటలో పండిన మామిడి పండ్లు తింటే.. మగ పిల్లలే పుడతారంటూ ఓ సామాజిక కార్యకర్త చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారాయి. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసిందెవరు. 

మహారాష్ట్రలోని భీమా కోరేగావ్‌ అల్లర్ల నిందితుడు, మహారాష్ట్ర శివ ప్రతిష్టన్ అధ్యక్షుడు శంభాజీ బిడే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిడే చేసిన వ్యాఖ్యలు..దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయ్. తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారన్నారంటూ కొత్త వివాదానికి తెరతీశారు. రాయ్‌గఢ్‌లో మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్‌... బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన శంభాజీ బిడే నాసిక్ లో జరిగిన ర్యాలీలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తమ తోటలో మామిడి పండ్లు తింటే మగ పిల్లలు పుడతారన్న సంగతి...తన తల్లికి తప్పా ఎవరికి చెప్పలేదని శంభాజీ తెలిపారు. తన తోటలో ఉన్న మామిడి పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయన్న ఆయన....ఇప్పటి వరకు 180 జంటలకు ఈ మామిడి పండ్లు ఇస్తే 150 మంది మగ పిల్లలు పుట్టారని చెప్పారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే...తన తోటలో మామిడి పండ్లు తినాలని సూచించారు. అంతేకాదు...సంతానలేమితో బాధపడే దంపతులకు ఈ మామిడి పండ్లు ఫలితం దొరుకుతుందన్నారు. 

శంభాజీ వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఆభా సింగ్‌ మండిపడుతున్నారు. శంభాజీ పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుతున్నారన్న ఆమె...అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే శంభాజీ షిండే వ్యాఖ్యలతో మామిడి పళ్లపై చర్చ మొదలైంది. నిజంగా ఓ పండు తింటే పిల్లలు పుడతారా నిజంగా అలాంటి చెట్లు ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

మంత్రాలకు, మాయ మాటలకు, మామిడి పళ్లకు.. మగపిల్లలు పుడుతారంటే.. మనిషన్నవాడెవడూ నమ్మడు. అంతెందుకు.. శంభాజీ చెప్పిందే నిజమైతే.. అంతా ఆయన మామిడి పళ్ల కోసం ఎప్పుడో క్యూ కట్టేవారు. అప్పుడు.. మనదేశంలో అంతా మగవాళ్లే ఉండేవారేమో..? ఇలాంటి మాయల మరాఠీ మాటలను నమ్మడం అంటే.. అవివేకమే. 

English Title
Childless couples have babies after eating mangoes from my farm: Sambhaji Bhide

MORE FROM AUTHOR

RELATED ARTICLES