టీడీపీలో మరో విషాదం..

Submitted by arun on Fri, 08/31/2018 - 11:43
pp

నందమూరి హరికృష్ణ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన తెలుగుదేశం శ్రేణులకి మరో విషాద వార్త వెలుగులోకి వచ్చింది. ఏపీ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి సతీమణి పల్లె ఉమ నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పదిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆసుపత్రికి వెళ్లి సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. రఘునాథరెడ్డిని పరామర్శించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రఘునాథరెడ్డిని పరామర్శించి తమ సానుభూతి తెలియజేశారు.

English Title
chief whip palle raghunatha reddy wife uma passes away

MORE FROM AUTHOR

RELATED ARTICLES