షికాగో సెక్స్ రాకెట్ దెబ్బ..

Submitted by nanireddy on Sun, 06/24/2018 - 09:12
chicago-sex-racket-affect-indians-visas-rejected

అమెరికాలో  జరగబోయే సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి  24 మంది అమెరికాకు రావడానికి అనుమతించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ సిపారసు లేఖ యూఎస్‌ కాన్సులేట్‌ కు చేరింది. అయితే అనూహ్యంగా వారిలో కేవలం నలుగుర్ని మాత్రమే అనుమతించారు. మిగిలిన దరఖాస్తులను తిరస్కరించారు. ఇక వీరి పరిస్థితే ఇలా ఉంటే కొందరు సినిమా నటీమణుల పరిస్థితి మరోలా ఉంది. త్వరలో జరగబోయే మహాసభలకు చాలా మంది సినిమా ఆర్టిస్టులు విసాలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందులో 75 శాతం  వీసాలు తిరస్కరణకు గురవవుతున్నాయని ఆర్టిస్ట్ సురేఖారాణి తెలిపారు. కేవలం మహాసభల పేరుతో వెళ్లేవారి వీసాలను వారు తిరష్కరిస్తున్నారని ఆమె వాపోయారు.  వారికి ఏ ప్రశ్నలూ లేకుండానే వీసా తిరస్కరిస్తున్నారు యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులు. దీనికి కారణం అడిగితే మాత్రం వారు చెప్పడానికి నిరాకరిస్తున్నారని బాధితులు అంటున్నారు. 

English Title
chicago-sex-racket-affect-indians-visas-rejected

MORE FROM AUTHOR

RELATED ARTICLES