మావోయిస్టుల ట్రైనింగ్‌కు వేదికగా దండకారణ్యం...సోషల్ మీడియాలో కలకలం రేపుతోన్న టైనింగ్‌ వీడియో

x
Highlights

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యం మావోయిస్టుల ట్రైనింగ్‌కు వేదికగా మారింది. కొత్తగా రిక్రూట్‌ చేసుకున్న మావోయిస్టు సభ్యులను అత్యాధునిక ఆయుధాలతో...

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యం మావోయిస్టుల ట్రైనింగ్‌కు వేదికగా మారింది. కొత్తగా రిక్రూట్‌ చేసుకున్న మావోయిస్టు సభ్యులను అత్యాధునిక ఆయుధాలతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మావోయిస్టు సభ్యులకు ట్రైనింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పారామిలటరీ బలగాలు ఏ దిశలో వచ్చినా ఎన్ని రూపాల్లో వచ్చినా దీటుగా ఎదుర్కొనేందుకు మావోయిస్టు సభ్యులకు కఠినంగా శిక్షణ ఇస్తున్నారు. దండకారణ్యంలో మావోయిస్టులకు శిక్షణ ఇస్తున్న వీడియో పోలీసులను విస్తుపోయేలా చేస్తోంది.

చత్తీస్‌గఢ్‌ పోలీసుల నుంచి అందుతున్న అనధికారక సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు భారీగా క్యాడర్ ను కోల్పోతున్నారు. దీంతో మిగిలిన దళ సభ్యుల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు కొత్తగా పోరాట యోధులను తయారు చేసుకునేందుకు మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య ప్రాంతంలో ఒక స్కూల్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. దీనికి బునియాది మావోయిస్టు ట్రైనింగ్‌ స్కూల్‌గా పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో పోరాట నైపుణ్యాలు, హిందీ భాష, సామాజిక అంశాలు, మ్యాథ్స్, సైన్స్ అంశాలలో బోధన సాగుతున్నట్లు సమాచారం.

గిరిజన యువతను మావోయిస్టు దళాల్లోకి చేర్చుకున్న తర్వాత ఆరు నెలల పాటు స్కూల్‌లో వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రతి బ్యాచ్‌లో 30 నుంచి 35 మంది సభ్యులు ఉంటారు. భద్రతా సమస్యలు ఎదురైనపుడు ప్రతి కొత్త బ్యాచ్‌ శిక్షణా శిబిరాన్ని రహస్య ప్రాంతానికి తరలిస్తారు. దండకారణ్య జోనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గెరిల్లా శిక్షణా కార్యక్రమాలు నడుస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు పట్టుబడ్డ మావోయస్టు కొరియర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. పోలీసు శాఖ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను అధికారికంగా ధృవీకరించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories