టీడీపీలో కలకలం... మేయర్‌పై కేసునమోదు

Submitted by arun on Thu, 01/11/2018 - 11:33
abdul

నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. స్టార్ ఆగ్రో పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మేయర్‌ తో పాటు అత‌ని సోద‌రుడు జ‌లీల్, డైరెక్ట‌ర్ అనిల్ పై మద్రాస్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో చీటింగ్ కేసు న‌మోదు అయింది. క్రైమ్ నెంబర్ 431-2017 అండర్ సెక్షన్ 406, 420, 506, రెడ్‌విత్ 120-బి, ఐపీసీ కేసులు నమోదు చేశారు. స్టార్ ఆగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42 కోట్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారంటూ ప్రసాద్ జెంపెక్స్ అనే కంపెనీ మద్రాస్ చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో మేయర్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా ముందస్తు బెయిల్ కోసం మేయర్ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా... ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న మేయర్ అజీజ్ పై కేసు నమోదు కావడంతో టీడీపీలో కలకలం సృష్టించింది.

English Title
cheating case on nellore mayor

MORE FROM AUTHOR

RELATED ARTICLES