ఛత్తీస్‌గఢ్‌లో చక్రం తిప్పేదెవరు? 

ఛత్తీస్‌గఢ్‌లో చక్రం తిప్పేదెవరు? 
x
Highlights

అధికారం కోసం నువ్వా, నేనా అన్న రీతిలో తలపడుతున్న ఛత్తీస్ గఢ్ లో విజయం ఎవరిని వరిస్తుంది?అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ఎవరికి వారు ప్రచారంలో దూసుకు...

అధికారం కోసం నువ్వా, నేనా అన్న రీతిలో తలపడుతున్న ఛత్తీస్ గఢ్ లో విజయం ఎవరిని వరిస్తుంది?అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ఎవరికి వారు ప్రచారంలో దూసుకు పోతున్నా.. ఫలితంపై మాత్రం ఉత్కంఠ రేగుతోంది. కారణం అక్కడ అజిత్ జోగీ, మాయాల కూటమి బరిలోకి దిగడంతో ఏ పార్టీ ఓటు బ్యాంకుకు నష్టం కలుగుతుందన్నది పజిల్‌గా మారింది. తొలి విడత ఎన్నికలు పూర్తి చేసుకున్న ఛత్తీస్ గఢ్ లో పోలింగ్ బహిష్కరించమన్న నక్సల్స్ పిలుపును పక్కన పెట్టి మరీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొన్నారు. 2013 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అతి తక్కువ మార్జిన్ లో గెలిచే అవకాశాన్ని పోగొట్టుకుంది.బిజెపి, కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం, సీట్ల శాతంలో తేడా చాలా తక్కువే.. అప్పట్లో కాంగ్రెస్ వెంట అప్పటి ముఖ్యమంత్రి అజిత్ జోగీ ఉన్నారు.. కానీ నేటి ఎన్నికల నాటికి జొగీ కాంగ్రెస్ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ ఛత్తిస్ గఢ్ పేరుతో ఎన్నికల బరిలో నిలిచారు.

బీఎస్పీ కాంగ్రెస్ పొత్తు ప్రయత్నం బెడిసికొట్టినా.. మాయావతి, సిిపిఐ స్నేహ హస్తాన్ని అందుకోడంలో జోగీ తెలివిగా అడుగేశారు. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ఒకటైన చత్తిస్ గఢ్ లో బిఎస్పీ, సీపీఐ, కాంగ్రెస్ కూటమి ఓట్ షేర్ బిజేపీ కన్నా 2003 నుంచి ఎక్కువే ఉంటోంది. కానీ బీఎస్పీతో స్నేహం కుదుర్చుకోడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. అటు కాంగ్రెస్, ఇటు బిజెపీ హోరా హోరీగా తలపడుతుంటే. మాయావతి ఒంటరిగా బరిలోకి దిగడం.. ఆ రెండు పార్టీల అవకాశాలనూ దెబ్బ తీస్తుందని సర్వేలు చెబుతున్నాయి. బీఎస్పీ, సిపిఐ ల ఓట్ షేర్ కొన్ని నియోజక వర్గాల్లో గత మూడు ఎన్నికల్లో కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

ఈ రెండు పార్టీలు చేసే నష్టమే ఎక్కువనుకుంటుంటే ఇప్పడు అజిత్ జోగీ వేరుగా బరిలోకి దిగి ఈ పార్టీలతో జతకట్టడం సంచలనంగా మారింది. జోగీ తొలిసారి విడిగా పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ కే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 2008లోనూ, 2013లోనూ ఎక్కువ ఓట్లు సంపాదించిన సీట్ల నుంచే అజిత్ జోగీ ఈసారి బరిలో నిలబడుతున్నారు. ప్రాంతీయంగా బలంగా ఉన్న నేతలు సొంత పార్టీని కాదని నేరుగా బరిలోకి దిగితే పార్టీకి కలిగే నష్టం అపారమని చరిత్ర చెబుతోంది. గతంలో కర్ణాటకలో యడ్యూరప్ప, మధ్య ప్రదేశ్ లో ఉమాభారతి బిజెపిని కాదని సొంతంగా బరిలోకి దిగడంతో బిజెపిి ఓట్లు, సీట్ల శాతం బాగా దెబ్బ తింది. ఇప్పుడు చత్తీస్ గఢ్ లో కూడా ఇదే తరహా నష్టం జరగొచ్చు.. అజిత్ జోగీ ఏ మేరకు కాంగ్రెస్ కి నష్టం కలిగిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories