ధర్మాబాద్ కోర్టు నోటీసులపై చంద్రబాబు కీలకనిర్ణయం

Submitted by arun on Wed, 09/19/2018 - 14:17

బాబ్లీ ఆందోళన విష‍యంలో ఏపీ సీఎంకు జారీ అయిన నాన్‌బెయిలబుల్ నోటీస్ వ్యవహారంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తన తరపున న్యాయవాదిని పంపాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌, చార్జ్‌షీట్ ఆధారంగా నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేయాలని బాబు తరపు న్యాయవాది కోరునున్నారు. ఈ నెల 21న ఈ కేసు విచారణకు రానుంది.  ఇదే విషయంపై నిన్న ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో నాందేడ్‌ ఎస్పీ ఫోన్‌‌లో సంభాషించారు. చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ ఉందని లేఖ పంపుతున్నామని, లేఖతో పాటు వారెంట్ కూడా పంపుతున్నామని నాందేడ్‌ ఎస్పీ సమాచారం అందించారు. అయితే తమకు లేఖ మాత్రమే అందిందని, నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ పంపలేదని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు తిరిగి నాందేడ్ ఎస్పీకి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. కేసు పత్రాలు లేకుండా ఎలా వెళ్తామని నాందేడ్ ఎస్పీని ఉన్నతాధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

English Title
Chandrababu Taking Key Decisions On Maharashtra Court Issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES