పీఎంవోలో జగన్ అనుచరులు ..రేపోమాపో కేసులు మాఫీ

Submitted by lakshman on Sun, 03/18/2018 - 15:01
chandhrababu naidu fire on jagan

సీఎం చంద్రబాబు వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు. కేంద్రంపై అవిశ్వాసతీర్మానం అంటూనే జగన్ తన కేసుల్ని మాఫీ చేసుకునేందుకే పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. 
చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయ చతురతకు పదును పెడుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలంటూ వైసీపీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు తనతో పాటు అధికార పక్షం టీడీపీ చేతులు కలపాలని జగన్ పిలుపునిచ్చారు. దీంతో కక్కలేక మింగలేక వైసీపీ కి మద్దతు పలికిన టీడీపీ ..గంటల వ్యవధిలోనే రూటు మార్చే తామే సొంతంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. 
తనతో కలిసిరావాలంటూ బీజేపీ వ్యతిరేక వర్గంతో మంతనాలు జరిపి సఫలమైంది. మరోవైపు జగన్ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని ప్రకటించారే తప్పా..ఆ తీర్మానం సజావుగా జరిగేలా ప్రయత్నాలు చేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో సీఎం చంద్రబాబు వైసీపీ - బీజేపీ - జనసేన పై మండిపడ్డారు. తాము రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంపై పోరాటం చేస్తుంటే వైసీపీ నేతలు పీఎం వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పీఎంవోలో జగన్ అనుచరులు ఉన్నారని ..రేపో మాపో జగన్ కేసులు కూడా మాఫీ అవుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా  తాము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని.. ఎన్డీఏ నుంచి బయటికి రావడంపై స్పందించారు. జనసేన, వైసీపీ, బీజేపీల మహా కుట్రను బయటపెట్టామని చంద్రబాబు చెప్పారు 
  ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రం తమకు అన్యాయం చేసిందని ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కేంద్రం అన్యాయం చేసినా చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తూనే ఉన్నారని చెప్పారు. 15ఏళ్లపాటు హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు మాట మార్చడం సరికాదని అన్నారు. 
ఇక ఢిల్లీలో టీడీపీ పెద్ద ఎత్తున కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని మద్దతు కూడగట్టుకునే పనిలో ఉండగా..పార్లమెంట్ లో అవిశ్వాసతీర్మానంపై చర్చకు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
 

English Title
chandhrababu naidu fire on jagan

MORE FROM AUTHOR

RELATED ARTICLES