కుక్క అనుకొని రెండేళ్ల నుంచి పెంచింది.... అసలువిషయం తెలిసేసరికి...

కుక్క అనుకొని రెండేళ్ల నుంచి పెంచింది.... అసలువిషయం తెలిసేసరికి...
x
Highlights

కుక్క అనుకుని రెండేళ్లు ఓ జంతువును పెంచింది ఓ మహిళా తీరా చూస్తే ఆది కుక్క కాదని తెలిసి నోరెళ్లబెట్టింది. దీంతో రెండేళ్ల తన శ్రమ వృధా అయిందనుకుని...

కుక్క అనుకుని రెండేళ్లు ఓ జంతువును పెంచింది ఓ మహిళా తీరా చూస్తే ఆది కుక్క కాదని తెలిసి నోరెళ్లబెట్టింది. దీంతో రెండేళ్ల తన శ్రమ వృధా అయిందనుకుని ఫారెస్ట్ అధికారులకు ఆ జంతువును అప్పజెప్పింది.. ఇంతకీ ఏంటా కథ.. వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన 'మిస్ యూ' రెండేళ్ల కిందట దగ్గరలోని ఫారెస్ట్ కు వెళ్ళింది అక్కడ అచ్చం కుక్క లాగ ఉండే ఓ జంతువు కనిపించింది. ఇదేదో వింతజాతి కుక్క అనుకుంది. వెంటనే దాన్ని ఇంటికి తీసుకువచ్చింది. రెండేళ్ల పాటు బలమైన ఆహరం పెట్టి ఆ జంతువును పెంచింది.. ఈ క్రమంలో అది విపరీతమైన బరువు పెరగడం చూసి ఆశ్చర్యపోయింది.. ఎందుకు వచ్చిన గొడవలే అనికుని దానికి ఒక బోను ఏర్పాటు చేసి అందులో ఆ జంతువును ఉంచింది. ఆ తరువాత అది దాదాపు 200 కిలోల బరువు పెరగడం చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చింది. ఆ జంతువును చూసిన అధికారులు ఇది కుక్క పిల్ల కాదు ఎలుగుబంటి అని సమాధానమిచ్చారు.. దీంతో ఖంగుతిన్న మిస్ యూ దాన్ని వారికి అప్పజెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories