ఐదో రోజు కొనసాగుతున్న సీబీఐటీ విద్యార్థుల ఆందోళన

ఐదో రోజు కొనసాగుతున్న సీబీఐటీ విద్యార్థుల ఆందోళన
x
Highlights

ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా గండిపేట సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. పెంచిన ఫీజులను తగ్గించాలని గత కొన్ని...

ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా గండిపేట సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. పెంచిన ఫీజులను తగ్గించాలని గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం కళాశాలకు హాజరైన విద్యార్థులు క్లాస్‌లకు వెళ్లకుండా రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఏబీవీపీ మద్దతు తెలుపుతుంది.

ఇదిలా ఉంటే సీబీఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుండగా పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం విద్యార్ధుల ఆందోళనలపై సీబీఐటీ యాజమాన్యం స్పందించింది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను ప్రకటించిన ప్రిన్సిపల్‌ రవీందర్‌రెడ్డి హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు పెంచడం జరిగిందన్నారు. పెంచిన ఫీజులను ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్ధులు చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. ఎవరైనా చెల్లించలేని పేద విద్యార్ధులుంటే దరఖాస్తు చేసుకోవాలని, వాళ్లకు స్కాలర్‌షిప్‌ మంజూరుచేసే విషయాన్ని పరిశీలిస్తామని సర్క్యులర్‌‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ పెంచిన ఫీజులను వసూలు చేయడం జరుగుతుందని యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో విద్యార్థులు యాజమాన్యం దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు.

కన్వీనర్ కోట ద్వారా వచ్చిన విద్యార్థి ఫీజు TSFRC కమిటీ నిబంధనల ప్రకారం లక్ష 13 వేల 5వందల రూపాయలు. కానీ కాలేజీ యాజమాన్యం కోర్టుకు వెళ్లి అదనపు ఫీజులు వసూలు చేసేలా అనుమతి తెచ్చుకుంది. రెండు లక్షల ఫీజు కట్టాలంటూ విద్యార్థులకు హుకుం జారీ చేసింది. అది కూడా డిసెంబర్‌ 15 లోగా కడితేనే పరీక్షలకు అనుమతిస్తామనడంతో సీబీఐటీ విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఉన్న పలంగా అంత ఫీజు కట్టలంటే ఎక్కడికి పోవాంలంటు ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories