హైద‌ర‌బాద్ యూబీఐ స్కాం నిందితులు అరెస్ట్

Submitted by lakshman on Sat, 03/24/2018 - 02:20
CBI arrests Totem Infrastructure directors in Rs 1,394-cr loan fraud case


యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టొటెం ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అధినేత‌లు రూ.313కోట్ల‌కు టొక‌రా వేసి పారిపోయిన విష‌యం తెలిసిందే. అయితే పారిపోయిన ఈ నిందితున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉన్నారనే పక్కా సమచారం అందడంతో శుక్రవారం అక్కడికి వెళ్లిన సీబీఐ అధికారులు టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవితలను అక్కడ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
కాగా 1997 హ‌ర్యానాలోని గుర్గావ్ లో తొట్టెంపూడి స‌ల‌లిత్ ఛైర్మ‌న్ అండ్ ఎండీగా వ్య‌హ‌రిస్తూ టొటెం ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ పేరిట కంపెనీని స్థాపించారు. రోడ్ల నిర్మాణం, వాటర్‌ వర్క్స్‌, బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ లాంటి పలు ప్రాజెక్టులను టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ చేపట్టేది. అంతేకాదు, ఎల్ అండ్ టి, ఆర్ఐటిఇఎస్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ వంటి పెద్ద కంపెనీలకు సబ్ ‌కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరించేది.
అయితే కంపెనీ అవసరాల నిమిత్తం ఎనిమిది బ్యాంకుల కన్సార్టియం నుంచి టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. 
వాటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ .208.67 కోట్లు), ఐడిబిఐ బ్యాంక్ (రూ. 174.47 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 126.30 కోట్లు), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (రూ. 79.96), జెఎం ఫైనాన్షియల్ అసెట్ (రూ .69.07 కోట్లు) సిండికేట్ బ్యాంక్ (రూ .64.48 కోట్లు) రుణాల్ని పొందింది. 
యూబీఐ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం బ్యాంకుల కన్సార్టియం టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఇంకా రూ. 1,394.43 కోట్లు చెల్లించాల్సివుంది. వేతనాలు, ఇతర ఖర్చుల కింద భారీగా లెక్కలు చూపుతూ రుణ మొత్తాలను ఇతర బ్యాంకుల ఖాతాల్లోకి మళ్లించారు.
 ఇతర బ్యాంకుల ఖాతాలకు సొమ్ము మళ్లించి... ఆ తర్వాత ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి రుణాల ద్వారా పొందిన సొమ్మును ఆ ఖాతాల్లోకి కంపెనీ ప్రమోటర్లు మళ్లించారు. వేతనాలు, ఇతర ఖర్చుల కింద భారీగా లెక్కలు చూపుతూ సొమ్ము మళ్లించారు. ఆ తర్వాత బ్యాంకుకు రుణాలు చెల్లించకుండా చేతులెత్తేశారు. టొటెం రుణాలను 2012 జూన్‌ 30నే మొండి బకాయిలుగా బ్యాంకుల కన్సార్టియం ప్రకటించింది. అంతేకాదు, ఈ కంపెనీ ప్రమోటర్లు తెలివిగా కంపెనీ లావాదేవీలన్నీ కన్సార్టియంలో ఉన్న బ్యాంకుల్లో కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా నిర్వహించారు.

English Title
CBI arrests Totem Infrastructure directors in Rs 1,394-cr loan fraud case

MORE FROM AUTHOR

RELATED ARTICLES