బూట్లు తొడుగుతూ కెమేరాకు చిక్కిన ఎమ్మెల్యే...

బూట్లు తొడుగుతూ కెమేరాకు చిక్కిన ఎమ్మెల్యే...
x
Highlights

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ పట్ల స్వామి భక్తిని ప్రదర్శించారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో...

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ పట్ల స్వామి భక్తిని ప్రదర్శించారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ నేత ఊర్మిళ సింగ్ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో, ఆమెకు కమల్ నాథ్ నివాళి అర్పించారు. అనంతరం ఆయన కాళ్లకు ఎమ్మెల్యే రజ్నీష్ సింగ్ బూట్లు తొడిగారు. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇది కాస్తా వివాదంగా మారడంతో రజ్నీష్‌ వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ...‘ కమల్‌నాథ్‌ నాకు తండ్రి లాంటి వారు. నేను ఆయన్ని ఎంతగానో గౌరవిస్తాను. నా చిన్నతనం నుంచి ఆయన కాళ్లు మొక్కి ఆయన వద్ద ఆశీర్వాదాలు తీసుకుంటాను. ఆయన మా కుటుంబానికి ఎంతో కావల్సిన వ్యక్తి. ముఖ్యంగా మానాన్నతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. కానీ దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇందులో వివాదం ఏంలేదు. కమల్‌ నాథ్‌కు నేను లేస్‌ కట్టేటపుడు ఎంతో మంది ఉన్నారు. షూ లేస్‌ కట్టుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతుంటే నేను సహాయం చేశాను అంతే. కొందరు దీన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు’ అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories