తెలంగాణ ఉద్యమకారుడు రవికి జైలు శిక్ష

తెలంగాణ ఉద్యమకారుడు రవికి జైలు శిక్ష
x
Highlights

తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసు కారణంగా టీఆర్‍ఎస్‍వీ నాయకుడు మున్నూరు రవికి 6 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ మహబూబ్‍నగర్‍ జిల్లా కోర్టు తీర్పు...

తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసు కారణంగా టీఆర్‍ఎస్‍వీ నాయకుడు మున్నూరు రవికి 6 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ మహబూబ్‍నగర్‍ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. 2012 సెప్టెంబర్‍ 26న మహబూబ్‍నగర్‍ పట్టణంలోని జడ్పీ మైదానంలో జరిగిన పాలమూరు కవాతు సందర్భంగా అప్పటి ఎస్సైకి మున్నూరు రవి విధులకు ఆటంకం కలిగించారని టూటౌన్‍ పోలీస్టెషన్‍‌లో కేసు నమోదు చేశారు. 2018 మే నెలలో మహబూబ్‍నగర్‍ లోయర్‍ కోర్టు మున్నూరు రవికి 6 నెలల జైలు శిక్ష, 10 వేల నగదు జరిమాన ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే మున్నూరు రవి కింది కోర్టు తీర్పును సవాల్‍ చేస్తూ జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కానీ లోయర్‌ కోర్టు తీర్పును సమర్థిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి రవి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో పోలీసులు మున్నూరు రవిని జిల్లా జైలుకు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories