హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ విషాదం

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ విషాదం
x
Highlights

మద్యం మత్తులో ఓ వ్యక్తి 3 కుటుంబాల్లో విషాదం నింపాడు. ఫూటుగా మద్యం తాగి వేగంగా కారు నడిపిన విష్ణువర్ధన్ స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువతులను...

మద్యం మత్తులో ఓ వ్యక్తి 3 కుటుంబాల్లో విషాదం నింపాడు. ఫూటుగా మద్యం తాగి వేగంగా కారు నడిపిన విష్ణువర్ధన్ స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువతులను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో జరిగిన ఈ ప్రమాదంలో మస్తానీ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో అమ్మాయి అనూషకు బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ప్రియ అనే యువతికి కాలు విరిగింది. ప్రస్తుతం ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతురాలు మస్తానీ స్వస్థలం తాడేపల్లిగూడెంగా గుర్తించారు. మరో ఇద్దరు యువతుల వివరాలు తెలియాల్సి ఉంది.

అర్ధరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 డైమండ్ హౌస్ దగ్గర.. కారు బీభత్సం సృష్టించింది. యాక్టివాపై వెళ్తున్న ముగ్గురు యువతులను.. వెనక నుంచి వేగంగా వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి కారు ఢీకొట్టింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత.. నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. భయంతో.. వేగంగా కారు నడపడంతో కిలోమీటర్ దూరంలోనే డివైడర్‌కు ఢీకొట్టాడు.

నిందితుడు విష్ణువర్ధన్ ఫూటుగా మద్యం సేవించి.. కారు నడిపినట్లు గుర్తించారు పోలీసులు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో.. 200 పాయింట్లకు పైగా ఆల్కహాల్ శాతం నమోదైంది. ప్రస్తుతం నిందితుడు విష్ణువర్ధన్ జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రమాదానికి కారణమైన కారు.. చిటుకుల భాగ్యలక్ష్మి అనే మహిళ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ యాక్సిడెంట్‌లో కారు, యాక్టివా నుజ్జునుజ్జయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories