అభ్యర్థుల్లారా... బీ అలర్ట్‌... బ్యాంక్‌ లావాదేవీలు నిఘా ఉంది!!

అభ్యర్థుల్లారా... బీ అలర్ట్‌... బ్యాంక్‌ లావాదేవీలు నిఘా ఉంది!!
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదల కాకముందే, పార్టీలు, అభ్యర్థుల...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదల కాకముందే, పార్టీలు, అభ్యర్థుల బ్యాంక్ లావాదేవిలపై నిఘా పెట్టింది. పెద్దమొత్తంలో డబ్బు ప్రవాహం జరిగే అవకాశం ఉందని, ఈసీ వర్గాలకు అందిన సమాచారంతో, పకడ్బందీ నిఘా వేస్తామంటోంది ఈసీ. అసెంబ్లీ ఎన్నికలను జీవన్మరణంగా భావిస్తున్నాయి అన్ని పార్టీలు. దీంతో ధన ప్రవాహం కూడా అదే స్థాయిలో ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.

నోట్ల రద్దు తర్వాత తెలంగాణలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో, అభ్యర్థులకు గెలుపు కత్తిమీదా సాములా మారిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. నోట్ల రద్దుతో ఎన్నికల్లో ధన ప్రవాహానికీ బ్రేక్ పడిపోతుందనుకున్నారు. కానీ ఇటీవల జరిగిన ఐదారు రాష్ట్రాల ఎన్నికలు, అందుకు భిన్నంగా సాగాయి. డబ్బు ఓ రేంజ్ లో ప్రవాహించింది. అందరి అంచనాలు తారుమారు చేస్తూ, ఎన్నికల్లో నోటు తన సత్తా చూపింది. తెలంగాణ ఎన్నికల్లోనూ పార్టీలు దండిగా డబ్బులు వెదజల్లేందుకు సిద్దమయ్యాయన్న అంచనాలున్నాయి. దీంతో ఎలక్షన్‌ కమిషన్‌ అప్రమత్తమైంది.

తెలంగాణలో ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు నోట్లను వారి పార్టీ క్యాడర్‌కు పంపిణి చేశారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అంతేకాక ఇక దేశంలో అత్యధికంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టే జాబితాల్లో ఉమ్మడి రాష్ట్ర్రంకు పేరు ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరుతున్న, రెండో ఎన్నికలు ఇవి. దీంతో ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకుట్ట వెయ్యాలని అనేక ప్రజాసంఘలు విజ్జప్తులు చేస్తున్నాయి. వీటన్నింటి దృష్టా ఎన్నికల కమిషన్, ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందే నుంచే, బ్యాంక్ లావాదేవిలపై దృష్టిపెట్టింది.

ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది ఎన్నికల కమిషన్. ఇందులో భాగంగానే, పార్టీలు, అభ్యర్థుల బ్యాంక్ లావాదేవిలపై దృష్టిపెట్టింది. పోలీసు శాఖ సహకారంతో, ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేసింది. ఇక షెడ్యూల్ విడుదల, ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కూడా ఫ్లైయింగ్ స్క్వాడ్ లతో ఎక్కడైనా డబ్బు ,మద్యం, పంపిణి జరుగతోందని తెలిస్తే, వెంటనే అక్కడికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. దీంతో పాటు 24 గంటలు ఫిర్యాదులు తీసుకునేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలనుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories