పోస్టుమ్యాన్‌కు కేంద్రం భారీ శుభవార్త.. ఇక పండగే

పోస్టుమ్యాన్‌కు కేంద్రం భారీ శుభవార్త.. ఇక పండగే
x
Highlights

డాక్‌ సేవక్‌(పోస్టుమ్యాన్‌) మూల వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం మూడురెట్లు పెంచింది.ఇంతకు ముందు ఉన్న మూల వేతనం రూ. 4,115 లు కాగా దీన్ని మూడు రేట్లు పెంచి...

డాక్‌ సేవక్‌(పోస్టుమ్యాన్‌) మూల వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం మూడురెట్లు పెంచింది.ఇంతకు ముందు ఉన్న మూల వేతనం రూ. 4,115 లు కాగా దీన్ని మూడు రేట్లు పెంచి మొత్తం రూ.14,500 వేతనాన్ని నెలకు పోస్టుమ్యాన్‌ లు అందుకునేలా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ‘ప్రస్తుతం నెలకు రూ.2,295ల వేతనం అందుకుంటున్న గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌)లు ఇకపై రూ. 10వేల వేతనాన్ని అందుకుంటారు. రూ. 2,745 ఉన్నవారు.. రూ. 10వేలు అందుకోనున్నారు. ఈ పెంచిన వేతనం 2016 జనవరి 1 నుంచే అమల్లోకి రానున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పెంచిన వేతనంతో కలిపి ఇప్పటివరకు రావాల్సిన వేతనం మొత్తం ఒకేసారి జమచేయనున్నట్టు పోస్టల్ శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories