బిజినెస్ మ్యాన్ పై జీనత్ అమన్ రేప్ కేసు..నిందితుడు అరెస్ట్

బిజినెస్ మ్యాన్ పై జీనత్ అమన్ రేప్ కేసు..నిందితుడు అరెస్ట్
x
Highlights

ఇండ‌స్ట్రీతో సంబంధం లేకుండా యాక్ట‌ర్స్ పై అఘాయిత్యాలు కొన‌సాగుతున్నాయి. 70ల‌లో త‌న గ్లామ‌ర్ తో ఓ ఊపుఊపేసిన జీన‌త్ అమ‌న్ ముంబైకి చెందిన ఓ వ్యాపార...

ఇండ‌స్ట్రీతో సంబంధం లేకుండా యాక్ట‌ర్స్ పై అఘాయిత్యాలు కొన‌సాగుతున్నాయి. 70ల‌లో త‌న గ్లామ‌ర్ తో ఓ ఊపుఊపేసిన జీన‌త్ అమ‌న్ ముంబైకి చెందిన ఓ వ్యాపార వేత్త‌పై కేసు పెట్టింది.
అలనాటి బాలీవుడ్‌ నటి జీనత్‌ అమన్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త అమర్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమర్ ఖాన్ తనపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, గత కొద్ది రోజులుగా తన మొబైల్ కు అసభ్యకర ఫొటోలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని జూహూ పోలీసులకు జీనత్ అమన్ ఫిర్యాదు చేశారు.
ప్రముఖ బాలీవుడ్ నటి, 70, 80ల్లో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా, గ్లామర్ లేడీగా పేరుగాంచిన జీనత్ అమన్ ముంబైకి చెందిన బిజినెస్‌మేన్ మీద జుహు పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెట్టారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కథనం ప్రకారం...ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు బిజినెస్‌మేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
తమకు జుహు పోలీస్టేషన్లో ఫిర్యాదు అందిందని, వెంటనే నిందితుడిని అరెస్టు చేశాం, లోకల్ కోర్టులో ప్రవేశ పెట్టాం. ఈ కేసును ప్రస్తుతం క్రైమ్ బ్రాంచికి బదిలీ చేశాం. దర్యాప్తు జరుగుతోంది' అని డీసీపీ నిసార్ తంబోలి తెలిపారు.
నిందితుడు నిందితుడిని 38 ఏళ్ల సర్ఫరాజ్‌గా గుర్తించారు. ఇతడిపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇతడు తనను చాలా కాలంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు 66 ఏళ్ల జీనత్ అమన్ ఆరోపిస్తున్నారు.
మీడియా రిపోర్ట్స్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.... 2011 నుండి 2015 మధ్య సర్ఫరాజ్... జీనత్ అమన్‌కు చెందిన రూ. 15 కోట్ల విలువ చేసే నగలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. నగలు ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో ముంబైలో ఆమె పేరు మీద ఉన్న 5 ప్లాట్లు ఫోర్జరీ పేపర్లు క్రియేట్ చేసి తన పేరున రాయించుకున్నట్లు సమాచారం.
పెళ్లి జరిగినట్లు ఫేక్ పేపర్స్ ఫేక్ మ్యారేజ్ పేపర్లు క్రియేట్ చేసి... తన గురించి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని బెదిరింపులకు పాల్పడ్డట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అతడిపై ఐపిసీ 376, 420, 406, 465, 467, 468, 469, 471, 506 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు మిర్రర్ నౌలో రిపోర్ట్స్ వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories