భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

Submitted by arun on Sat, 08/11/2018 - 11:49
bus accident

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. భద్రాచలం నుంచి విజయవాడ వెళుతుండగా సారపాక వంతెన  సమీపంలో అదుపు తప్పి పక్కనున్న 40 అడుగుల లోతు పొలాల్లోకి వెళ్లి  బోల్తా పడింది. ప్రమాదానికి గురైన బస్సులొ 40 మంది ప్రయాణీకులున్నట్టు గుర్తించారు. రోడ్డుపైనున్న గుంతలను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పినట్టు డ్రైవర్ తెలియజేశాడు. బస్సు బోల్తా పడిన పక్కనే వాగు భారీగా ప్రవహిస్తూ ఉండటంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల వారు గ్రామస్తుల సహకారంతోనే ప్రయాణీకులను పైకి తెచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. గాయపడిన వారిలో ఎవరికి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

English Title
bus accident in Bhadradri Kothagudem

MORE FROM AUTHOR

RELATED ARTICLES