ఒకే ఇంట్లో11 మంది ఆత్మహత్య కేసులో భయం గుప్పిట పోలీసులు..

Submitted by nanireddy on Tue, 07/10/2018 - 19:34
burari-case-police-officials-said-they-feel-stressed-out

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్య కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ రోజు వారందరు హత్యగావించారనే వార్తలు రాగా వారు మోక్షం కోసం ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి ఇప్పటికి ఈ విషయం తేల్చేందుకు పోలీసులు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. ఎవరో ఒకరిద్దరికి మాత్రమే మోక్షంపై ప్రీతీ ఉన్నప్పుడు వారు మాత్రమే చనిపోవాలి.. అలాంటప్పుడు అందర్నీ ఎందుకు చంపినట్టు,  పైగా కుటుంబంలో అందరికి ఒకే అభిప్రాయం ఉండటం సాధ్యమేనా అనే కోణంలో కూడా పోలీసుల విచారిస్తున్నారు. ఇదిలావుంటే 'ఈ కేసును విచారిస్తున్న పోలీసుల్లో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మునుపెన్నడు తమ జీవితంలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. పాపం చాలా మంది నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. విచారణ నిమిత్తం పోలీసులు తరచుగా బాటియా ఇంటికి వెళ్తుండటంతో వారు ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే' అని ఓ పోలీస్ అధికారి అంగీకరించారు. 

English Title
burari-case-police-officials-said-they-feel-stressed-out

MORE FROM AUTHOR

RELATED ARTICLES