కర్ణాటక రాజకీయాల్లో మరో కుదుపు..

Submitted by nanireddy on Fri, 10/12/2018 - 07:36
bsp-minister-n-mahesh-quits-kumaraswamy-cabinet

కర్ణాటక రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఎన్ మహేశ్ కుమారస్వామి మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు.. గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గురువారం తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అయన.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీని పటిష్టం చేసేందుకు వీలుగానే ముఖ్యమంత్రి కుమారస్వామికి రాజీనామా సమర్పించినట్లు మహేశ్‌ మీడియాకు తెలిపారు. మంత్రిగా తాను బెంగళూరుకు పరిమితమైనందున సొంత నియోజకవర్గం కొల్లెగల్‌లో తనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని వెల్లడించారు. కాగా తాను మంత్రిపదవినుంచి మాత్రమే తప్పుకుంటున్నానని.. కుమారస్వామికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో 2 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో జేడీఎస్ తరుపున ప్రచారం చేస్తానని అయన తెలిపారు.

English Title
bsp-minister-n-mahesh-quits-kumaraswamy-cabinet

MORE FROM AUTHOR

RELATED ARTICLES