ఏనుగు పార్టీ అంబారీనెక్కిస్తుందా? ఆదిలాబాద్‌ ఏమంటోంది?

ఏనుగు పార్టీ అంబారీనెక్కిస్తుందా? ఆదిలాబాద్‌ ఏమంటోంది?
x
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ మళ్లీ పుంజుకుంటుంది. గత ఎన్నికలలో నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్-టి నుంచి కోనప్ప విజయం...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ మళ్లీ పుంజుకుంటుంది. గత ఎన్నికలలో నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్-టి నుంచి కోనప్ప విజయం సాధించారు. అయితే తర్వాత రాజకీయ సమీకరణలలో బీఎస్పీ డిమాండ్ పెరుగుతుంది. బీఎస్పీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రధానపార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ టికెట్‌ను మంచిర్యాల ఎంపీపీ బేర సత్యనారయణ టికెట్ ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడంతో ఎంపీపీ నిరాశ చెందారు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి టీఆర్ఎస్‌కి గుడ్బై చెప్పి.. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థి దివాకర్‌రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు మంచిర్యాల నుంచి ప్రధాన పార్టీలకు దీటుగా పోటీ ఇస్తుండగా, ముథోల్ నియోజకవర్గం నుంచి సురేఖప్రకాశ్‌రాథోడ్ పోటీకి సిద్దమవుతున్నారు. సురేఖరాథోడ్ లంబడా సామాజికవర్గానికి సంబంధించిన వారు కావడం విశేషం. జనరల్ సీటైనా ముథోల్ నుంచి దిగుతున్నారు. దాంతో ఆ సామాజిక వర్గానికి నియోజకవర్గంలో 20 వేల ఓట్లున్నాయి. అవి తమకే పడుతాయంటున్నారు సురేఖ రాథోడ్. ముథోల్, మంచిర్యాలలో ఏనుగు పార్టీ బలం రోజురోజుకు పెరుగుతుంది. అదేవిధంగా బహు జన సమాజ్ పార్టీకి, దళిత, మైనారీటీ ఓటు బ్యాంకు ఉంది. ఈ ఓట్లపై ఆశలు పెట్టుకున్నా మిగితా పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు బీఎస్పీ అభ్యర్థులు. ప్రధానంగా ముథోల్ నియోజకవర్గంలో ముస్లిం మైనారీటీ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. గెలుపోటములను ఇవే ప్రభావితం చేస్తాయి. బీఎస్పీ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు ఓట్లు చీలుతాయని ఆందోళన చెందుతున్నారు. కోల్‌బెల్ట్ సింగరేణి ప్రాంతంలో బహుజన పార్టీ దూసుకపోతుండటంతో అధికార పార్టీ అభ్యర్థి ఆందోళన చెందుతున్నారు. ఏనుగు పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో కంటే మెరుగైనా ఫలితాలు వస్తాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. మరి బీఎస్పీ పార్టీని ఓటర్లు కరుణిస్తారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories