కూతురిని కట్టేసి.. తల్లిని చంపి..

Submitted by arun on Tue, 03/13/2018 - 08:55
murder

కూతురిని కట్టేసి తల్లిని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కొత్తపల్లిలో సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం..కాటారం మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు రామిల్ల కవిత (30), పదేళ్ల క్రితం భర్తతో విడిపోయి, తన ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు పిల్లలతో కలసి మంథనికి వెళ్లిన ఆమె, నూతన వధువుకు తోడుగా చిన్న కుమార్తెను ఉంచి, పెద్ద కుమార్తెతో కలసి ఇంటికి చేరుకుంది. ఆపై ఆమె ఇంట్లోకి చొరబడిన దుండగులు, కుమార్తె చేతులు కట్టేసి ఓ గదిలో బంధించారు. ఆమె చూస్తుండగానే కత్తిపీటతో కవిత తలనరికి హత్య చేశారు. ఆపై ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.

English Title
brutal murder tdp women mandal president

MORE FROM AUTHOR

RELATED ARTICLES