అన్నదమ్ముల మధ్య రైతుబంధు చిచ్చు

Submitted by arun on Wed, 06/13/2018 - 17:17
fight

రైతు బంధు చెక్కు రక్తసంబంధంలో చిచ్చుపెట్టింది. సర్కారు ఇస్తున్న చెక్కు కోసం అన్నాదమ్ముళ్లు ఒకరిపై ఒకరు కత్తితో దాడి చేసుకున్నారు. రైతు బంధు డబ్బుల కోసం ఓ అన్న తమ్ముడి రక్తం కళ్ల చూశాడు. రైతు బంధు డబ్బుల కోసం  లక్ష్మారెడ్డి(తమ్ముడు) తన అన్న బాబురెడ్డి తో కలిసి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. మాట మాట పెరిగి... కత్తులతో దాడికి దిగారు. ఈ దాడితో తమ్ముడు లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన లక్ష్మారెడ్డిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

English Title
brothers fight over rythu bandhu

MORE FROM AUTHOR

RELATED ARTICLES