పిల్లాడు ఏడుస్తున్నాడని బలవంతంగా విమానం నుంచి..

Submitted by nanireddy on Fri, 08/10/2018 - 08:34
british-airways-deplanes-indian-family-over-crying-3-year-old

కొత్త ప్లేసుకి వెళ్లినా, జన సందోహాన్ని చూసినా పిల్లలు ఏడుస్తారు. ఒక్కోసారి వారిని ఊరుకోబెట్టడం ఎవరి తరం కాదు. అలాగే ఆపకుండా ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు కూడా పిల్లాడ్ని, తల్లిని మార్చి మార్చి చూస్తుంటారు. అంతగా ఏడుస్తుంటే ఏం చేస్తున్నావు తల్లి అన్నట్లు ఉంటాయి వారి లుక్స్. విమానంలో కూర్చున్న పిల్లాడు ఏడుస్తుంటే సిబ్బంది ఏడుపు ఆపకపోతే క్రిందకు పడేస్తానంటే.. బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ లండన్-బెర్లిన్ విమానంలో ఓ భారతీయ కుటుంబం ప్రయాణిస్తోంది. ఫ్లైట్ క్రిందకు దిగుతున్న సమయంలో వారి మూడేళ్ల పిల్లాడు బెదిరిపోయి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడు. తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని సముదాయించే ప్రయత్నం చేస్తోంది. అయినా వాడు ఏడుపు ఆపట్లేదు. దాంతో క్యాబిన్ సిబ్బందికి కోపం వచ్చి.. యూ బ్లడీ.. ఏడుపు ఆపుతావా లేదా అని మండిపడ్డాడు. ఆపకపోయావంటే విండోలో నుంచి బయట పడేస్తా అంటూ హెచ్చరించాడు. ఆ మాటలకు వాడు మరింత బెదిరిపోయి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడు. క్రూ సిబ్బంది విమానాన్ని టెర్మినల్‌కు తీసుకువెళ్లి వారిని దించేశారు. బ్రిటీష్ విమానయాన సంస్థ తమతో వ్యవహరించిన తీరుని నిరసిస్తూ పిల్లాడి తండ్రి ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సురేష్ ప్రభుకు లేఖ రాశాడు. తమతో పాటు ప్రయాణిస్తున్న ఇతర భారతీయ కుటుంబాల్ని ఉద్దేశిస్తూ బ్లడీ ఇండియన్స్ అని వ్యాఖ్యానించాడని లేఖలో తెలిపాడు. అయతే దీనిని ఖండించిన బ్రిటీష్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి క్రూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి విచారణ జరిపిస్తామన్నారు.

English Title
british-airways-deplanes-indian-family-over-crying-3-year-old

MORE FROM AUTHOR

RELATED ARTICLES