వరునికి దండ వేసేందుకు వధువును పైకి ఎత్తిన బంధువు...లాగి పీకిన వధువు

Submitted by arun on Tue, 07/03/2018 - 13:27

ఎవరైనా చెంప దెబ్బకొడితే, ఎంత అవమానంగా ఉంటుంది? అది కూడా ఓ పెళ్లి మండపంలో నలుగురి ముందూ వధువు కొడితే... అంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందా? ఎక్కడ జరిగిందో తెలియదుగానీ, నిన్న సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో పెళ్లి వేడుక జరుగుతుంది.. ముహూర్తం దగ్గర పడే సమయంలో వధువు, వరుడు దండలు మార్చుకునేందుకు నిలబడ్డారు. వారి సాంప్రదాయం ప్రకారం వరుడిని, వధువుని వారి బంధువులు ఎత్తుకుని దండలు మార్పించాలి.. దీనిలో భాగంగా వరుడి తరపు బంధువు అతన్ని ఎత్తుకుని వధువు మెడలో దండ వేయించాడు.. ఇప్పుడు వధువు వంతు వచ్చింది. ఆమె తరపు బంధువు పైకి ఎత్తుకుని దండ వేయించాడు. ఆ క్రతువు పూర్తయిన వెంటనే.. కిందకు దించాడు.. ఆ వెంటనే  క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనను ఎత్తుకున్న బంధువును లాగి ఒకటి పీకింది ఆ పెళ్లికూతురు. అంతటితో ఆగకుండా నాలుగు తిట్లు తిట్టింది. నలుగురి ముందు తనకు జరిగిన అవమానానికి బాగా ఫీలయిన ఆ వ్యక్తి.. పక్కనే ఉన్న మరో యువతిని లాగి కొట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Tags
English Title
bride slaps guest

MORE FROM AUTHOR

RELATED ARTICLES