విషాదంలో బ్రహ్మానందం

Submitted by arun on Mon, 02/19/2018 - 10:19
Brahmanandam

హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గుండు హనుమంతరావుతో తనది 30 ఏళ్ల అనుబంధమని, ఆహ నా పెళ్లంట సినిమాతోనే తామిద్దరికీ గుర్తింపు వచ్చిందని బ్రహ్మానందం గుర్తు చేసుకొని కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తనను బ్రహ్మానందం బావ అని ఆప్యాయంగా పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు. ‘ఇటీవలే ఆయన తన ఇంటికి వచ్చాడని, హనుమంతు లేడంటే నమ్మలేకపోతున్నాను. ఆప్యాయతలో ఎలాంటి కల్మషం లేని వ్యక్తి హనుమంతరావు. నాకున్న అతితక్కువ మంది మిత్రుల్లో ఆయన ఒకరు. హనుమంతరావు ధన్యజీవి. హాస్యప్రదర్శనలతో ఎంతోమందిని అలరించాడు. జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నార’ని బ్రహ్మానందం అన్నారు. మృదుస్వభావి అయిన గుండు హనుమంతరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని హీరో బాలకృష్ణ అన్నారు. 
 

English Title
brahmanandam condole gundu hanumanth rao

MORE FROM AUTHOR

RELATED ARTICLES