ప్లీజ్ నా పేరు చెప్పొద్దు: రష్మిని వేడుకున్న బ్రహ్మాజీ

Submitted by arun on Thu, 02/08/2018 - 14:19
brahmaji

రష్మి ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయింది. అయితే ఆమె దశ తిరిగింది మాత్రం 'జబర్దస్త్' టీవీ షో తర్వాతే. ఈ కామెడీ షోకు యాంకరింగ్ చేసిన తర్వాత పాపులర్ అవ్వడంతో పాటు సినిమాల్లోనూ అవకాశం దక్కించుకుంది. గుంటూరు టాకీస్ తో పాటు రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం రష్మికి సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా రష్మి తన అభిమానులతో ట్విట్టర్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఫన్నీ ఇన్నిడెంట్ జరిగింది.

దీనిలో భాగంగా ఓ నెటిజన్ నీకు ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? అని ప్రశ్నించాడు. దీనికి ఉన్నారంటూ రష్మి సమాధానమిచ్చింది. ఈ కాన్వర్సేషన్ మధ్యలో ఎంటరైన బ్రహ్మాజీ ‘ప్లీజ్ చెప్పొద్దు.. నా పేరు రివీల్ చెయ్యకు’ అంటూ నమస్కరిస్తూ చిలిపిగా సందడి చేశాడు. అప్పుడు రష్మి ‘మీరు నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ సార్’ అంటూ లవ్ సింబల్‌తో సమాధానమిచ్చింది. మరో నెటిజన్ ‘సుధీర్ గురించి ఒక్క వర్డ్ చెప్పు’ అంటూ రష్మిని కోరాడు. మళ్లీ ఎంటరైన బ్రహ్మాజీ ‘సుడిగాలి’ అని ఆన్సర్ చేశారు. మరో నెటిజన్ బ్రహ్మాజీని ఉద్దేశిస్తూ ‘బ్రహ్మాజీ గారు మీకు మ్యారేజ్ అయినా కానీ మీరు అందంగా ఉండటానికి కారణమేంటి?’ అని ప్రశ్నించారు. దీనికి బ్రహ్మాజీ ‘మ్యారేజ్ చేసుకోండి’ అంటూ కొంటెగా సమాధానమిచ్చారు.

English Title
brahmaji funny comment on rashmi

MORE FROM AUTHOR

RELATED ARTICLES